మా పాలన బాగోలేదని ఒప్పుకున్న కాంగ్రెస్ ..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ అధికారక సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంటులో పెట్టిన పోల్ ఆ పార్టీకి మిశ్రమ స్పందన వచ్చింది. తెలంగాణలో ప్రజలు ఎలాంటి పాలనను కోరుకుంటున్నారు అంటూ ఓ పోల్ ను నిర్వహించింది. కింద ఆప్షన్స్ గా 1)ఫామ్ హౌజ్ పాలన.. 2)ప్రజాపాలన అని రెండింటిని ఇచ్చింది.
అయితే పోల్ పెట్టిన గంటన్నరకే అధికార పార్టీకి చుక్కలు చూయించారు నెటిజన్లు. ఫామ్ హౌజ్ పాలనే బాగుంది.. మాకు ఆ పాలనే కావాలని అరవై ఏడు శాతం మంది ఒప్పుకున్నారు. ముప్పై మూడు శాతం మంది మాత్రమే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాపాలన బాగుంది .. ప్రజాపాలన కావాలని కోరుకుంటున్నట్లు ఒప్పుకున్నారు.
ఈ సర్వే పోల్ ను బీఆర్ఎస్ సోషల్ మీడియా తెగ ట్రోల్స్ చేశారు. ఫామ్ హౌజ్ లో ఉన్న కేసీఆర్ పాలనను మెచ్చుకున్నారు. మీరు చెప్పిన అలవి కానీ హామీలను అమలు చేయకుండా ఉంటే ప్రజలు మీకు ఎలా ఓట్లు వేస్తారని తిప్పికొట్టారు… ఇప్పటికైన కండ్లు తెరిచి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలి. లేకపోతే వచ్చేన్నికల్లో సింగల్ డిజిట్ కూడా రాదని తెగ ట్రోలింగ్ చేశారు. దీంతో అధికారక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఆ పోస్టును డిలిట్ చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ..!