కోతికి కొబ్బరి చిప్ప.!. రేవంత్ కు అధికారం.!. రెండు ఒకటేనా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న ఎనుముల రేవంత్ రెడ్డి తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైన అధికారం కోసం .. ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయాలు చేస్తారు.. ప్రత్యర్థుల పై విమర్శనాస్త్రాలను సంధిస్తారు. అదేంటో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఓ పట్టాన అది కూర్చోని తినకుండా తన ఇష్టారాజ్యాంగా తింటూ సంబరపడుతుంది. రేవంత్ రెడ్డికి అధికారం కూడా అలానే ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబర్ మూడో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే బీఆర్ఎస్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ పథకాల హామీలను సైడ్ చేస్తున్నారు. ముందుగా కాళేశ్వరం కృంగింది. దీనిలో అవినీతి అన్నారు.
ఆ తర్వాత మిషన్ భగీరథలో అవినీతి అన్నారు. ఆ తర్వాత గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిందన్నారు. సంబంధిత మంత్రిత్వ ఆఫీసులో ఫైళ్లన్నీ కాలిపోయాయని ప్రచారం చేశారు. ఆ తర్వాత హైడ్రా ముందు వేసుకున్నారు.మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావులు తమ ఫామ్ హౌజ్ ల పరిరక్షణకై హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. అమాయక ప్రజలను ముందు పెడుతున్నారని విమర్శలు చేశారు. తమ పనితీరును.. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి అరెస్టులకు పూనుకున్నారు. అఖరికీ తాజాగా ఫార్ములా కారు ఈ రేస్ లో అవినీతి జరిగిందని హాడావుడిగా మాజీ మంత్రి కేటీఆర్ ను దోషిగా పరిగణిస్తూ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని తెగ ఆరాటపడ్డారు.
మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల ముప్పై తారీఖు వరకు అరెస్ట్ చేయద్దని .. విచారణ చేయాలని ఆదేశాలను ఇచ్చింది. ఇది పక్కకి పోవడంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే రంగంలోకి దిగి అల్లు అర్జున్ అంశాన్ని ముందరేసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ అంటే దేవాలయం.. అలాంటి దేవాలయంలో ప్రజల సమస్యల గురించి.. వారి భవిష్యత్తు గురించి చర్చలు జరగాలి. కానీ నిన్న శనివారం అసెంబ్లీలో రాష్ట్రంలో సమస్యల్లే లేవన్నట్లు.. ప్రజలంతా సుఖంగా ఉన్నట్లు అల్లు అర్జున్ అంశం గురించి రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటలు మాట్లాడారు. సంధ్య థియోటర్ దగ్గర జరిగిన సంఘటనను ఎవరూ సమర్ధించరు.
రేవతి మృతి పట్ల అందరికి సానుభూతి ఉంది. హీరో & ఆ సినిమా హాల్ యాజమాన్యం పై గుర్రుగా ఉన్నారు. కానీ రాష్ట్రంలో రైతులు రుణమాఫీ కాలేదు.. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. గురుకులాల్లో రోజుకో చోట ఫుడ్ ఫాయిజన్ సంఘటన వెలుగులోకి వస్తుంది. దీనికారణంగా ఇప్పటివరకు దాదాపు యాబై నాలుగు మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. వీటన్నింటిని గాలికి వదిలేసి అల్లు అర్జున్ అంశాన్ని ముందరేసుకోవడంపై కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు రేవంత్ రెడ్డికి అధికారం దక్కింది. అందుకే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఇంటబయటా ఆయనపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. మరి ఇప్పటికైన దారిలోకి వస్తారో లేదో చూడాలి..!