సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖాలో కాంగ్రెస్ కు షాక్..!

CM Revanth Reddy shocks Congress in Ilakha..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నిన్న కాక మొన్న కొడంగల్ కేంద్రంలో కాంగ్రెస్ నుండి పలువురు నేతలు.. కార్యకర్తలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లో చేరారు.
తాజాగా కొడంగల్ మండలం చిన్న నందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు బొంరాస్పేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికీ చేరారు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సంద ర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ అభివృద్ధి పూర్తిగా వెనుకబడి పోయింది.. రైతులు, ప్రజలతో పాటు పార్టీ అధికారం కోసం పదేండ్ల పాటు అహర్నిశలు శ్రమించిన పార్టీ శ్రేణులకు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందుకోలేక నానా ఇబ్బందులకు గురవుతున్నాము. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే తెలంగాణను కాపాడు కునే అవకాశం ఉంటుందని వారు అన్నారు.
