“హైడ్రా” పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైడ్రాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ” హైడ్రా అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసింది. నగరంలో అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించడమే లక్ష్యం.
ఆ లక్ష్యంలో నెరవేరడంలో ఎవరున్న కానీ వదిలే ప్రసక్తి లేదు.. చెరువులను.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారు ప్రభుత్వంలో ఉన్న కానీ వదిలిపెట్టబోము. చెరువులను పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం. చెరువులను ప్రకృతిని పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాలి అని ఆయన తెలిపారు.