రాత్రి హోటల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy key announcement on night hotels
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “ఓ మంత్రి తన కూతురితో పదిన్నరకు నగరంలో అన్ని చోట్ల తిరిగిన కనీసం ఐస్ క్రీమ్ బండి కూడా లేదు..
తిరిగి ఇంటికొస్తుంటే ఓ ఐస్ క్రీమ్ బండి అతను తారసపడగా సదరు మంత్రి అతన్ని అడగగా రాత్రి పది దాటగానే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.. అందుకే పదిగంటలకు అన్ని మూసేస్తున్నారు అని చెప్పాడని సభలో మాట్లాడిన సంగతి మనకు తెల్సిందే..
తాజాగా రాత్రిపూట హోటల్స్ నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు . అందులో భాగంగా వైన్స్ తప్పా ఏ హోటల్ అయిన సరే రాత్రి పూట ఒకటి ఇంటి వరకు నడుపుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులకు వాళ్ళను గురి చేయద్దు అని ఓ ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు..
