టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తీవ్ర టెన్షన్ లో ఉన్నారని మాజీ మంత్రి…బీజేపీ సీనియర్ నాయకులు డీకే ఆరుణ అన్నారు..
ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి పాలన అనుభవం లేదు..అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. రేవంత్ రాజకీయాలు పక్కనపెట్టి మొదట ధాన్యం కొనుగోలు చేయాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు. తెలంగాణలో బీజేపీ 10-12సీట్లు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.