CM పదవికి కేటీఆర్ సరికొత్త భాష్యం
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం పదవికి సరికొత్త భాష్యం చెప్పారు.. తన అధికారక ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సీఎం అంటే కంటింగ్ మాస్టరా..?.. మొన్న ఐదోందల సిలిండర్ కు మంగళం పాడారు.. నిన్న రెండోందల యూనిట్ల ఉచిత కరెంటుకు కటీఫ్ చెప్పారు.. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్తలో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతురుణమాఫీ చేస్తామని ఇప్పుడు మాట తప్పారు..
కేవలం ముప్పై ఒక్కటి వేల కోట్ల రూపాయలను మాత్రమే రైతురుణమాఫీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం రైతులను నట్టింట ముంచడమే అని పేర్కోన్నారు.. తాజాగా ఓ మంత్రి ఉన్న రేషన్ కార్డులను తొలగిస్తాము.. ఆసరా పించన్లు కట్ చేస్తామని అంటున్నారు. అంటే సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని సరికొత్త భాష్యం చెప్పారు అని ఎనుముల రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు..