ఏపీలో మరో కొత్త కార్యక్రమం

As long as the Telugu race exists, NTR trust will exist..!
ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ” రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖున “”పేదల సేవలో”” అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ లో అధికారులతో సహా అందరూ భాగస్వాములు కావాలి.ప్రజల కష్టాలను తెలుసుకుని పేదరికం లేని నవసమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్టోబర్ రెండో తారీఖున రాష్ట్రానికి సంబంధించిన 2047 విజన్ డాక్యుమెంటరీ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
వందరోజుల లక్ష్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. సూపర్ సిక్స్ హామీలకు మేము మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలోనే వాటిన్నంటిని అమలు చేసి తీరుతాం అని ఉద్ఘాటించారు.