హెచ్ సీయూ తరలింపు పై క్లారిటీ..!

Clarity on HCU relocation..!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంచ గచ్చిబౌలి పరిధిలోని నాలుగు వందల ఎకరాలతో పాటుగా యూనివర్సిటీకి చెందిన పదిహేను వందల ఎకరాల భూముల్లో హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఏకో పార్కును అభివృద్ధి చేస్తాము.
హైదరాబాద్ యూనివర్సిటీని తరలిస్తాము అని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలో బ్యానర్ ఐటెం గా వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత..తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులైన మల్లు రవి క్లారిటీచ్చారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ ” హెచ్ సీయూ యూనివర్సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేయతలపెట్టిన ఫోర్త్ సిటీకి తరలిస్తాము.
కంచ గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలతో పాటు యూనివర్సిటీకి చెందిన పదిహేను వందల ఎకరాలు మొత్తం రెండు వేల ఎకరాల్లో ఏకో పార్కును అభివృద్ధి చేస్తాము. భవిష్యత్తు తరాలకు వాటర్.. ఆక్సిజన్ అందిస్తాము అని వ్యాఖ్యానించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది.మీరు ఒక లుక్ వేయండి.
