సాయిపల్లవి … మాములు పల్లవి కాదూ..!

సాయిపల్లవి చూడగానే బక్కపలచుగా.. మన పక్కింట్లో అమ్మాయిగా కన్పిస్తుంది. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెమలి లా నాట్యమాడుతుంది. ఇక నటన గురించి చాలా నేచూరల్ గా ఉంటుంది. అందం ఎలాంటి మేకప్ లేకుండా చాలా చాలా సాధారణంగా ఉంటుంది. అందుకే సాయిపల్లవి నేచూరల్ బ్యూటీ అంటారు.
అలాంటి సాయిపల్లవి ఇన్ స్టాగ్రామ్ లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. మొత్తం దేశంలోనే మోస్ట్ మోస్ట్ ప్రభావితం చేసే ( ఇన్ ఫ్లుయెన్షియల్) సెలబ్రిటీగా అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. హీరో తమిళ పవర్ స్టార్ విజయ్ దళపతిలను సైతం పక్కనెట్టి మరి మొదటిస్థానంలో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
ఇన్ స్టాగ్రామ్ లో సాయిపల్లవి గురించి తెలుసుకోవడానికే ఎక్కువ మంది వెతికారు . దాదాపు ఇరవై శాతం మంది ఆమె గురించి తెలుసుకోవడానికి ఆరాటపడ్డారు. ఇక ఎంఎస్ ధోనీ గురించి 17%, విజయ్ దళపతి గురించి 20% సెర్చ్ చేశారు. అయితే మిగతా ఏ హీరో యిన్లు సాయిపల్లవికి దరిదాపుల్లో లేకపోవడం విశేషం.
