మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటిపై క్లారిటీ..!
వచ్చే నెలలో మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. దీంతో నిన్న ట్విట్టర్ వేదికగా జరిగిన ASKKTR. కార్యక్రమంలో ఓ నెటిజన్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మహారాష్ట్ర ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు..
దీనికి సమాధానంగా కేటీఆర్ #AskKTRలో వివరిస్తూ ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు.
అటు హైదరాబాద్ లో నెలరోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టడం షాకింగ్ అంశం అన్పించింది.. ఈ రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ అని ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.