కాంగ్రెస్ లో చిచ్చు రేపిన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు

 కాంగ్రెస్ లో చిచ్చు రేపిన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు

Teenmar Mallanna Member of Telangana Legislative Council

Loading

రాజ్యసభ సభ్యులు … బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్ లో సెగలు రేపినట్లు తెలుస్తుంది.. ఆ సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణకు అఖరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డినే.. ఆ తర్వాత బీసీ సామాజిక వర్గం నుండో.. తెలంగాణకు మూడో వ్యక్తి సీఎం అవుతారని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి..

అయితే బీసీ కులగణన చేపట్టాలి.. ఆ గణన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దు అని గతంలోనే తీన్మార్ మల్లన్న హెచ్చరించిన సంగతి తెల్సిందే.. తాజాగా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇటు తెలంగాణ రాజకీయాల్లో అటు గాంధీభవన్ లో కాకలు పుట్టిస్తున్నాయని టాక్. తీన్మార్ మల్లన్న అన్న ఉద్ధేశ్యం మంచిదే కావోచ్చు కానీ ప్రస్తుతం అధికార పార్టీలో ఉండి చేయడం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు .

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ రావాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ ఈ నాలుగేండ్లు ప్రజలకు మెచ్చే పనులు చేయాలి.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ముచ్చట.. ఇవన్నీ పక్కనెట్టి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న మతలబు ఏంటి అని ఇటు రాజకీయ వర్గాల్లో అటు గాంధీ భవన్ వర్గాల్లో అంతుబట్టడం లేదని టాక్ విన్పిస్తుంది. చూడాలి మరి తీన్మార్ మల్లన్న ఏదైన పట్టుబడితే అది సాధించేవరకు పట్టు వదలడని ఆయన అభిమానులు చెబుతున్న ముచ్చట.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *