తెలంగాణలో ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు ఖాయమా..?
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో రెండు జిల్లాల పేర్లు మార్చనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.. రాష్ట్రంలోని రెండు జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును, ఉమ్మడి వరంగల్ లోని ఏదైనా మరో జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తాజా సమాచారం.
అయితే ఇప్పటికే టీఎస్ నుంచి టీజీగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.