జగన్ కు చంద్రబాబు షాక్..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు బిగ్ షాకిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో టీడీపీ ఆరోపించిన సంగతి తెల్సిందే.
తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఆడుదాం ఆంధ్రాపై పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తిన అవినీతి జరిగింది.
విచారణ చేయించాలని సభ్యులు సభలో డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ విచారణ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
