చంద్రబాబు వార్నింగ్
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాధికారులకు వార్నింగ్ ఇచ్చారు.వరదల విపత్తు సమయంలో అధికారులు ఎవరూ సరిగా పనిచేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలే.. అత్యవసర పరిస్థితుల్లో అధికారులంతా.. వ్యవస్థలన్నీ సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
సరిగ్గా పనిచేయకపోతే తాను సహించేది లేదని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. ఈరోజే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశాను. ఐదేళ్ళుంగా అధికార వ్యవస్థలేవి సరిగా పని చేయలేదు. ముందు నుండి చెబుతున్నాను తొంబై నాటీ సీఎం ను చూస్తారని .. మీరు వినడం లేదు.
విజయవాడ వరదల్లో మునిగితే మనమే కదా పనిచేయాలి.. బాధితులకు అండగా ఉండాల్సింది. అలసత్వం వహిస్తే సహించను.. బాధ్యతగా వ్యవహరించకపోతే చర్యలు తప్పవు.. రాష్ట్రంలో కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. ప్రకాశం బ్యారేజ్ లో బోట్లపై విచారణ జరిపిస్తాము.ఇళ్ళలో పాములు,తేళ్లు వస్తున్నాయి.. ఆహరం పంపిణీ అందలేదని పిర్యాదులు వస్తున్నాయి..తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.