అన్నచెల్లెల మధ్యలో చంద్రబాబు..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య విబేధాలు ఎప్పటినుండో ఉన్న సంగతి మనకు తెల్సిందే. కాకపోతే ఒకటి రెండు సార్లు తప్పా ఎక్కడా ఎప్పుడు కూడా అవి బయట పడినట్లు మనకు కన్పించలేదు. తాజాగా ఆస్తుల విషయంపై వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కోర్టు దాక వెళ్లడంతో ఈ విషయం గురించి అందరికి క్లారిటీ వచ్చింది.
ఈ అంశం గురించి వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ తన అన్నను జైలుకు పంపి అధికార కూటమికి లబ్ధి చేకూరాలనే బాబు & టీమ్ ఆడే ఆటలో వైఎస్ షర్మిల పావులు కదుపుతున్నారు .. అందుకే నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ షర్మిల తన తల్లి విజయమ్మ షేర్లను తనపై బదిలీ చేస్తున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా జగన్ విజయనగరంలో డయారీయా బాధితులను పరామర్శించిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ ” గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కతోవ పట్టించడానికే కూటమి ప్రభుత్వం మా కుటుంబ విబేధాలను వాడుకుంటుంది. ఎవరి కుటుంబంలోనైన ఇలాంటి విబేధాలు సహాజం. కానీ వీటిని కూడా రాజకీయాల కోసం తమ స్వార్ధం కోసం వాడుకునే స్థాయికి బాబు దిగజారారు. బాబు లెక్క మేము మా మామకు వెన్నుపోటు పొడవలేదు.. పార్టీని లాక్కోలేదు. ఆ పార్టీకి చెందిన ఆస్తులను దోచుకోలేదు. అయిన అన్న చెల్లెల మధ్యలో చంద్రబాబు ఎందుకు దూరారో ఆర్ధం కావడం లేదని ఆయన ఆరోపించారు.