తెలంగాణకు కేంద్రం మరోసారి అన్యాయం
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయం అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. గత పదేండ్లలో కూడా బడ్జెట్ లో ఆశించిన నిధులను కేటాయించలేదు.. తాజాగా ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సైతం మరోసారి అన్యాయం చేశారు.
ఎన్డీఏలో కీలకంగా ఉన్న జేడీయూ టీడీపీ పాలిత రాష్ట్రాలైన బీహార్ ,ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించడం లేదు తప్పు లేదు కానీ ఎనిమిది మంది ఎంపీలను అందించిన తెలంగాణకు కేటాయించకపోవడం చాలా బాధాకరం.
విభజన హమీలను సైతం ప్రస్తావించకపోవడం.. కనీసం తెలంగాణ పేరును కూడా కేంద్ర ఆర్ధిక మంత్రి పలకపోవడం తెలంగాణ బీజేపీ ఎంపీల పనితనానికి నిదర్శనం.. నిధులు ఇవ్వని ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా ఉండి ఏమి లాభం అని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.