సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పోరాటానికి అండగా బీఆర్ఎస్..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం.. ఇప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నిరసనలు కొనసాగిస్తే, సమస్య తీవ్రమవుతుందని బెదిరింపు దోరణిలో మాట్లాడుతుండటాన్ని ఖండిస్తున్నాను.
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు..