HCU భూముల వివాదంపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం..!

BRS’ sensational decision on the HCU land dispute..!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మూడేండ్ల తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుంది.
అప్పుడు ఈ భూములను వెనక్కి తీసుకోని హైదరాబాద్ లోనే ది బెస్ట్ ఎకో పార్కును అభివృద్ధి చేస్తాము. అందుకే ఎవరూ ఈ భూములను కొనవద్దు . ముందే చెబుతున్నాము ఈ భూములను ఎవరూ తీసుకున్న కానీ అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చారించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ హెచ్ సీయూ విద్యార్థుల పోరాటాన్ని ఉద్యమాలను హేళన చేస్తూ మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఇలాగే తమ తీరును కొనసాగిస్తే ఉద్యమం మేము కూడా తీవ్రతం చేస్తాం అని అన్నారు.