మీ మార్పు అంటే ఇదేనా ..?

 మీ మార్పు అంటే ఇదేనా ..?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లారీ డ్రైవర్ను తిడుతూ కొట్టిన వీడియో ఒకటి వైరలైంది..

దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు.చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని అన్నట్లు పాలించేటోడు ఎట్లుంటడో కింద వ్యవస్థ కూడా అట్లనే ఉంటది..

ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీడ్రైవర్ పైన చేయి చేసుకొని దుర్భాషలాడటమేనా ట్రాఫిక్ పోలీస్ బాధ్యత.తప్పు చేస్తే జరిమానా విధించాలి లేదా కేసు ఫైల్ చేయాలి కానీ దూషించుడు ఏంది?..ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేసి బూతుల పోలీసింగ్ తెచ్చుడేనా మీ మార్పు? అని కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడింది.

https://x.com/BRSparty/status/1813807497708466440?t=jIWJfC8yuKb_67yjD0GY1g&s=19

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *