రేపు హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ,సీబీఐ నమోదు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. పది లక్షల విలువైన రెండు ష్యూరీటీలతో సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కవితకు సంబంధించిన పాస్ పోర్టును సరెండర్ చేయాలి.. సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదనే కండీషన్స్ విధించింది.
దీంతో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కవిత తరపున న్యాయవాది మోహీత్ రావు ష్యూరీటీ పేపర్లను.. బెయిల్ కాపీ జైలు అధికారులకు అందజేయనున్నారు. అనంతరం ట్రయల్ కోర్టు నుండి బెయిల్ పై ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారు.
ఈరోజు రాత్రి ఏడు గంటలకు ఎమ్మెల్సీ కవిత జైలు నుండి విడుదల కానున్నారు. రాత్రికి ఢిల్లీలోనే మాజీ మంత్రులు కేటీ రామారావు, తన్నీరు హారీష్ రావులు అక్కడ ఉండనున్నారు. రేపు ఉదయం నిర్వహించే మీడియా సమావేశం అనంతరం రేపు మధ్యాహ్నాం హైదరాబాద్ కు కవిత తిరిగి రానున్నారు. మరోవైపు కవితకు బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగితేలుతున్నారు.