అయోమయంలో ఫిరాయింపుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు వచ్చి కనీసం నెల రోజులు కాకముందే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహారి, ప్రకాష్ గౌడ్,అరికెలపూడి గాంధీ లాంటి వాళ్లు కారు దిగి హాస్తం గూటికి చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు.. పలువురు ఎమ్మెల్యేలు కారుకు గుడ్ బై చెప్పి హాస్తాన్ని అందుకున్నారు. చేరేంతవరకు మీరు ఏదడిగితే అది ఇస్తాము.. మీరు చెప్పిందే వేదం అని భరోసా ఇచ్చిన నాయకులు తీరా పార్టీ మారినాక అంతా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది.. మా చేతిలో ఏమి లేదని పార్టీ చేరిక సమయంలో భరోసానిచ్చిన సదరు నాయకుడు ఇప్పుడు చేతులేత్తేశారంట.
ఒకవైపు ఇంటి పోరు.. మరోపక్క ఈడీ రైడ్స్ తో సతమతమవుతున్న సదరు నాయకుడు నోటికి ఎంత వస్తే అంత వాగి ఇప్పుడు అసలకే ఎసరు వచ్చేలా పరిస్థితులను తెచ్చుకున్నాడు ఆ నాయకుడు. ఆ నాయకుడి సంగతి పక్కనెడితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు స్థానికంగా ఎలాంటి గౌరవ మర్యాదలు లేకపోగ.. కాంగ్రెస్ నేతలే అంతా తాము చెప్పినట్లే నడవాలని సంబధితాధికారులకు హూకుం జారీ చేశారంట. నియోజకవర్గంలో ఎవరికైన సమస్య వస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరకెళ్తారు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందంట.
గత ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థుల హవానే నడుస్తుందని ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అనుచరుల దగ్గర వాపోతున్నరంట. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడనే లోటు తప్పా కింది నుండి హైదరాబాద్ వరకు తాము చెప్పిందే నడిచేది. ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ పక్కనెట్టు గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త కూడా తమను డేకడం లేదని వారు వేదన పడుతున్నారంట. పార్టీ మారి తప్పు చేశామేమో అని అయోమయంలో ఉన్నారంట. కొండ నాలుకకు ఉప్పు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అధికార పార్టీ లో చేరితే నాలుగు పైసలైన సంపాదించుకోవచ్చు..
వచ్చేన్నికల్లో ఆ పైసలను పెట్టి గెలవచ్చు అని కలలు కన్న వారి ఆశలు అడియాశలయ్యాయి అని బాధపడుతున్నారంట. అందులో భాగంగా బీఆర్ఎస్ లో తమకు పరిచయమున్న అగ్రనేతలతో టచ్ లోకెళ్తున్నారంట. మళ్లీ బీఆర్ఎస్ లోకి వస్తాము.. మేము చేసిన తప్పు తెలుసుకున్నాము.. మాకు అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నారంట. పదేండ్లు రాజభోగాలను అనుభవించి అధికారం పోగానే కష్టాల్లో పార్టీ ఉన్నప్పుడు వదిలి వెళ్లిన వాళ్లను తీసుకునేదే లేదని గులాబీ బాస్ తేల్చి చెప్పడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఏంటో అని మదనపడుతున్నారట.
ఇప్పటికైన పార్టీ మారేటప్పుడు భరోసా ఇచ్చిన నాయకుడు మాకు అందుబాటులోకి వచ్చి మా సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పెద్దలకు కబుర్ల మీద కబుర్లు పెడుతున్న లాభం లేదని మౌనవ్రతం చేస్తున్నారంట. ఇలాంటి కష్టం తమ పగవాడ్కి కూడా రావోద్దని వాళ్లు గుసగుసలాడుకుంటున్నారంట.