Big Breaking News :- BRS మాజీ ఎమ్మెల్యేలు హౌజ్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి దిగజారుతున్న సర్కారు ఆసుపత్రుల పరిస్థితులపై అధ్యాయనానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజయ్య, ఎమ్మెల్యే డా. సంజయ్, మరో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ లతో కల్పి ఓ కమిటీ వేసిన సంగతి విధితమే.. ఈ కమిటీ ఈరోజు గాంధీ ఆసుపత్రిని సందర్శించాలని అనుకున్నది.
అంతే గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాల విషయంలో అధ్యయనం చేయడానికి ఆసుపత్రికి బయల్దేరక ముందే వైద్య కమిటీ సభ్యులని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు…రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవల విషయంలో అధ్యయనం చేసేందుకు… ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం గమనార్హం…
ఇప్పటికే కమిటీ అధ్యక్షులు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇండ్ల వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు..ఈ ముగ్గురు నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది..