10ఏండ్లలో బీఆర్ఎస్ 30వేల ఉద్యోగాలు ఇవ్వలేదు

TPCC chief
పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనలో కనీసం ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. గ్రూప్ – 1 అభ్యర్థులను బీఆర్ఎస్ తమ రాజకీయాల కోసం వాడుకున్నారు.
సిగ్గులేకుండా రోడ్లపైకి వచ్చారు అని టీపీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే యాబై వేల ఉద్యోగాలిచ్చాము.. గ్రూప్ -1 నిర్వహిస్తున్నాము.. మెగా డీఎస్సీ వేసి పోస్టులను భర్తీ చేశాము. పదేండ్ల తమ పాలనలో నిరుద్యోగ యువతను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.