గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?

 గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?

కేజీఎఫ్ హీరో పీఎం ను కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్తాడు.. “నేను సామాన్యంగా యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తాను.కుదరలేదంటే గెలిచే తీరుతా” అని అంటాడు.. ఇదే సూత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ తీరుకు అద్ధం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీలోపల… అటు అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది.

అయిన కానీ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి మందం జోష్ రావడం తప్పా క్యాడర్ లో జోష్ రాలేదు.అయితే ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడం.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలందర్నీ అరెస్ట్ చేయడం మనం గమనించాము.. సాయంత్రం ఆరు గంటలకు బీఆర్ఎస్ శ్రేణులను మూడు బృందాలుగా విభజించి హైదరాబాద్ సీపీ(సైబరాబాద్ )కార్యాలయం నుండి మూడు వైపులా మహబూబ్ నగర్ వైపు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో ఆయా మార్గాల్లో ఉన్న గ్రామాలు.. పల్లెల నుండీ బీఆర్ఎస్ సామాన్య కార్యకర్త నుండి నాయకుల వరకు రోడ్లపైకి వచ్చి మరి నేతలను తీసుకెళ్తున్న వ్యాన్లను అడ్డుకోవడం.. పోలీసులను శాంతియుతంగా అడ్డుకోని మరి మా నేతలను విడుదల చేయాలని ధర్నాలు రాస్తోరోకులు.. ప్రభుత్వం ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలను తగులబెట్టుడు ..ఈ సంఘటలన్నీ నాటి ఉద్యమ టీ(బీ)ఆర్ఎస్ ను.. క్యాడర్ ను నిద్రలేపింది. టీ(బీ)ఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ… పోరాటమే ఊపిరిగా ధర్నాలు రాస్తోరోకులే తమ అస్త్రాలుగా చేసిన పార్టీ.. పద్నాలుగేండ్ల పాటు చేసిన ఉద్యమాలే తెలంగాణ కలను సాకారం చేసింది.

ఆ తర్వాత పదేండ్ల పాటు అధికారంలో ఉండటం.. గులాబీ దళపతి ఒప్పుకున్నట్లు పదేండ్లు ప్రజాసంక్షేమమే తప్పా క్యాడర్ ను పట్టించుకోకపోవడం.. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు కానీ అధికారం కానీ నడవడం వల్ల క్యాడర్ కొద్దిగా నిర్లిప్తంగా ఉంది. కానీ మాజీ మంత్రి హారీష్ రావు పాడి గాంధీ వివాదంలో చూపిన తెగువ.. చేసిన పోరాటం వల్ల మళ్లీ క్యాడర్ లో జోష్ పెరిగింది.. కేవలం గంటల వ్యవధిలోనే కల్వకుర్తి నియోజకవర్గంలో కేశంపేట మండల పీఎస్ కు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు కొన్ని వేల మంది తరలిరావడం కేసీఆర్ ఆదేశాల మేరకు హారీష్ రావు చేసిన పోరాటం.. ఇచ్చిన పిలుపు ఫలితం..

ఇదే విధంగా ప్రతి సమస్యపై ఇంతే అగ్రెసివ్ గా కోట్లాడి క్యాడర్ లో జోష్ నింపితే మళ్లీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్ల తేడా కేవలం 1.85% మాత్రమే. అంటే ఐదు లక్షల ఓట్లు మాత్రమే. క్యాడర్ కొద్దిగా నారాజుగా ఉండటం వల్లనే ఓడిపోయింది కూడా బీఆర్ఎస్. కానీ ఇప్పుడు మాస్ ను అట్రక్ట్ చేసే హారీష్ రావును ముందు పెట్టి క్యాడర్ కు ఎప్పటికప్పుడు జోష్ నింపితే బీఆర్ఎస్ కు పెద్ద కష్టం ఏమి కాదు. అయితే గల్లీ నుండీ హైదరాబాద్ వరకు అన్ని కమిటీలు వేసి . ప్రజల సమస్యలపై.. ప్రభుత్వ విధానాలపై పోరాటంలో ఆ కమిటీలన్నీ పాల్గోనేలా చేస్తే బీఆర్ఎస్ కు ఫలితముంటుంది.

ఇదే  అగ్రెసివ్ ను కొనసాగించాలి. ఎందుకంటే ఇదే అగ్రెసివ్ తో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఇదే విధానంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అగ్రెసివ్ ల మధ్య తేడా బీఆర్ఎస్ అగ్రెసివ్ విధానంలో సబ్జెక్టుతో కూడిన కంటెంటు ఉంది.. అప్పట్లో కాంగ్రెస్ అగ్రెసివ్ లో ఫేక్ ప్రచారం .. దూషణలతో కూడిన కంటెంటు ఉంది. సబ్జెక్టు ఉందా లేదా అని కాకుండా ప్రజలు అగ్రెసివ్ నే కోరుకుంటారు. అందులో సబ్జెక్టు ఉంటే ఇంకా ప్రజలు ఆదరిస్తారు. ఇలా చెప్పడానికి బీఆర్ఎస్ గత పద్నాలుగేండ్ల పోరాటం గుర్తుకు తెచ్చుకోవచ్చు అని రాజకీయం విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే మొన్న హారీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు చూపించిన తెగువ అగ్రెసివ్ పాలిటిక్స్ కంటిన్యూ చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *