బీఆర్ఎస్ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!

 బీఆర్ఎస్ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!

ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు.. బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆరు నెలలు తిరగకముందే బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ గూటీకి చేరిపోయారు. పార్టీ ఫిరాయింపు సమయంలో మీకు ఏది కావాలంటే అదిస్తాము.. ఏమి కోరుకుంటే అది నెరవేరుస్తాము. మీరు అడిగితే కొండ మీద కోతిని సైతం తీసుకోచ్చి మీకిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో సహా ఓ ప్రముఖ మంత్రి సైతం సదరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అప్పట్లో హామీల మీద హామీలిచ్చారు.

తీరా పార్టీలోకి వచ్చాక వాళ్లకు ముఖ్యమంత్రి తో సహా సదరు మంత్రి హామీల సంగతి దేవుడెరుగు కనీసం అపాయింట్మెంట్ సైతం ఇవ్వడం లేదని తమ అనుచరుల వద్ద వాపోతున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం అని పార్టీ మారితే వాటి ఊసే లేదు. తమ నియోజకవర్గాల్లో ఆ పార్టీ తరపున బరిలో నిలబడి తమపై ఓడినవారికి బాధ్యతలు అప్పజెప్పడంతో ఇంకా నిరాశనిస్పృహాలో కృంగిపోయారంట. దీంతో చేసేది ఏమి లేక ఇటీవల మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గార్ని ఓ ఆరుడెరుగురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ కు చెందిన ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌజ్ కెళ్లి కల్సినట్లు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు.

ఈ కలయికపై కొన్ని వార్త పత్రికల్లో బ్యానర్ ఐటెం గా ప్రచురితమయ్యాయి. అయితే కేసీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన అలవీకాని హామీలను నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. వీరు ఎంత పనిమంతులో ప్రజలకు సైతం తెల్వాలి కదా.. మీరు కూడా పదేండ్లు అధికారాన్ని అనుభవించి పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో.. ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలను సైతం వదిలేసి వెళ్లారు. ఇప్పుడు అక్కడ మీకు జరుగుతున్న అవమాన ఇబ్బందులను తట్టుకోలేక బ్యాక్ టూ హోమ్ అంటూ వస్తున్నారు. క్యాడర్ తో స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అని సున్నితంగా వారి రాకను తిరస్కరించినట్లు కూడా ఆ వార్తల సారాంశం. అయితే గతంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సంగతి కూడా మనకు తెల్సిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *