MLC గా బొత్స ఏకగ్రీవం
ఏపీలోని వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి… వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవమయ్యారు.. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ ఎన్నిక నియామక పత్రాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అందజేశారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి మెజార్టీ బలం లేకపోతే అభ్యర్థిని నిలబెట్టలేదు.
ఎన్నిక నియామక పత్రాన్ని అందుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ” అధికార పార్టీ అంగ బలం.. ఆర్ధబలానికి లొంగకుండా నాకు అండగా నిలిచిన వైజాగ్ స్థానిక సంస్థల ప్రతినిధులకు నా పాధాభివందనాలు.. వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను..
నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన మాజీ ముఖ్యమంత్రి.. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గార్కి ప్రత్యేక కృతజ్ఞతలు.. స్థానిక సంస్థల అభివృద్ధికై.. సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంపై పోరాడతాను.. మండలిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల.. ప్రజల గొంతుకనై విన్పిస్తాను “అని తెలిపారు.