జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీదే విజయం – గువ్వల బాలరాజు..!

Guvvala Balaraju
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని బీజేపీలో ఇటీవల చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ” గతంలో తాను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించినట్లే ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని” ఆయన ఆరోపించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” ఈరోజు మంగళవారం కేంద్ర ప్రభుత్వం డెబ్బై తొమ్మిదో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పిలుపునిచ్చిన హార్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొనడానికి బయలు దేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లికి కుంకుమార్చన కార్యక్రమానికి హజరవ్వడానికి వెళ్లకుండా ఆపిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయం అని ఆయన హెచ్చరించారు.