బీఆర్ఎస్ చచ్చిన ఓ పాము..!
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై మెదక్ బీజేపీ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిజామాబాద్ పర్యటనలో బీజేపీ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘునందన్ రావు కౌంటరిచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేండ్లలో ఎన్నో అవినీతి అక్రమాలు చేశారని బీఆర్ఎస్ నేతకపై ఆరోపణలున్నాయి..
అధికారం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ ఓ చచ్చిన పాములా తయారైంది..మాజీ మంత్రి కేటీఆర్ పై ఉన్న ఫార్ములా ఈ రేసు కేసుతో బీజేపీకి ఏంటి సంబంధం ఉంది..ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆర్థిక శాఖ అనుమతిలేకుండా నిధులను మళ్లించారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీ గురించి చేసిన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి..అధికారం కోల్పోయాక రాష్ట్రంలోని బీసీలపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు..బీసీ కులగణనపై కవిత ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు.చిత్తశుద్ధి ఉంటే బీసీకి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు..