రేషన్ కార్డులపై శుభవార్త..!

తెలంగాణలో ఈ నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు.. జారీ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన సంగతి తెల్సిందే. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర సంక్షేమ శాఖ కీలక ఆదేశాలను ఇచ్చింది.
ఈ ఆదేశాలతో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై నెలకొన్న అయోమయం వీడినట్లైంది.తాజాగా పౌరసరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంతో సోమవారం నుంచి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో దరఖాస్తుకు కేవలం రూ.50 మాత్రమే వసూలు చేయాలని మీసేవ నిర్వాహకులను ప్రభుత్వం ఆదేశించింది.
