వైసీపీకి బిగ్ షాక్
వైసీపీ పార్టీకి అప్పుడే షాకుల పర్వం మొదలైంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుండి తప్పుకున్న సంగతి తెల్సిందే.
తాజాగా ఆ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు రాజీనామా చేశారు.
తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి శిద్ధా ప్రకటించారు.