TDP కి షాక్
ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకపక్క సీట్లు రావడం లేదు అని కొంతమంది ఆ పార్టీకి దూరంగా ఉంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.
మరో పక్క ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రాజకీయాలకు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించారు. వైజాగ్ జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గోన్నారు.
ఈ సందర్భంగా బండారు మాట్లాడూతూ రాజకీయంగా నాకు ఇదే చివరి రాజకీయ సమావేశం అని ప్రకటించారు. అయితే తాను రాజకీయాల నుండి తప్పుకున్న కానీ పార్టీ కార్యకర్తలకు మాత్రం అండగా ఉంటానని హామీచ్చారు.