రేవంత్ రెడ్డి సర్కారుకి బిగ్ షాక్..!

CM Revanth Reddy
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన సంగతి మరిచిపోకముందే హెచ్ సీయూ వివాదంలో సైతం సుప్రీం కోర్టు అక్షింతలే కాదు ఏకంగా సీఎస్ నే జైలుకి పంపుతామని వార్నింగ్ సైతం ఇచ్చింది.
ఆ విషయం ఇంకా ప్రజల మదిలో ఉండగా ప్రభుత్వానికి ఏకంగా ఆర్టీసీ ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. మే ఆరో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను బంద్ చేస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు.తమ డిమాండ్ల అమలు కోసం చర్చించడానికి ప్రభుత్వం మమ్మల్ని ఎలాంటి చర్చలకు పిలవడం లేదు.
కారుణ్య నియామకాలు.. పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలి. లేకపోతే మే ఆరో తారీఖు నుండి ఆర్టీసీ బస్సులను డిపో నుండి బయటకు కదలనివ్వము అని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పలు సమస్యలతో తల పట్టుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుకి ఇదోక బిగ్ షాక్ లా మారబోతుంది.
