బొప్పాయి గింజల వల్ల లాభాలెన్నో…!

Benefits Of Papaya Seeds
సహాజంగా అందరూ బొప్పాయి తిని.. దానిలోపల ఉన్న గింజలను పడేస్తారు. అయితే బొప్పాయి గింజలను తినడం వలన అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ ,ప్లేవ నాయిడ్స్ ఉంటాయి.
ఇవి కాలేయ కణాలు అక్సీకరణ , వాపు , ఒత్తిడి నుండి కాపాడతాయి.ఈ గింజల్లో ఉండే సమ్మేళనాలు దెబ్బ తిన్న కాలేయకణజలాన్ని సైతం బాగుచేస్తాయి.ఈ గింజల్లో ఉండే ఎంజైమ్స్ , పపైన్ వంటీ పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియాలు నోటి దుర్వాసన ,చిగుళ్ల ఇన్ ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మూత్ర పిండాలు ,మూత్ర నాళాల నుండి విషాన్ని బయటకు పంపడంలో సాయపడతాయి. బొప్పాయి గింజల్లో ఉండే ఫైబర్ శరీరంలో ఉండే చెడును తొలగిస్తుంది.
