బాప్ 2024 కా… బేటా 2029 కా…?

KCR KTR
KCR మూడక్షరాల పేరు కాదు.. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన పేరు.. ఆ వాంఛను నెరవేర్చడమే కాదు ఏకదాటిగా పదేండ్లు పాలించి సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి.. డెబ్బై ఏడేండ్ల చరిత్ర ఉన్న భారతావనిలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సంక్షేమాభివృద్ధిని చేసి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వైపు యావత్ దేశమే కాదు ప్రపంచమే చూసేలా చేసిన ఘనమైన చరిత్ర ఉన్న పేరు. అలాంటి నాయకుడు భవిష్యత్తు రాజకీయ పరిణామాలను సైతం ముందే ఊహించగల సామార్ధ్యం ఉన్నోడు.
అంత సామార్ధ్యం ఉంది కాబట్టే గత లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో హాంగ్ వస్తుంది. బీఆర్ఎస్ కు పదో పన్నెండో సీట్లివ్వండి. కేంద్రంలో చక్రం తిప్పుదాం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు హక్కుల కోసం కోట్లాడుదాం.. రాష్ట్రంలో అధికారంలో లేకపోయిన కానీ కేంద్రంలో ముఖ్య పాత్ర పోషిస్తాము కాబట్టి మనం అనుకున్నవన్నీ నెరవేర్చుకోవచ్చు అని తెలంగాణ సమాజానికి పిలుపునిచ్చారు. అయితే కొన్ని రాజకీయ పరిణామాలను బట్టి ప్రజలు కేసీఆర్ ఆశించిన విధంగా తీర్పునివ్వలేదు.. గెలుస్తామనుకున్న చోట్ల కూడా మూడో స్థానానికి పరిమితమయ్యారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు. కేసీఆర్ అన్నట్లే ప్రాంతీయ పార్టీలే కేంద్రంలోని ప్రభుత్వాన్ని నిర్ణయించింది.
తాజాగా ఆయన తనయుడు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల విడుదలైన జమ్మూ కాశ్మీర్ ,హరియాణా ఎన్నికల ఫలితాల గురించి ట్వీట్ చేస్తూ భవిష్యత్తు దేశ రాజకీయాలను శాసించేది కేవలం ప్రాంతీయ పార్టీలే.. ప్రాంతీయ పార్టీల బలబలాల మీదనే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో మాజీ మంత్రి కేటీఆర్ భవిష్యత్తులో కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నది అని తన తండ్రి గత లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన విధంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తుందని ఇటు క్యాడర్ కు. అటు తెలంగాణ సమాజానికి సందేశం ఇస్తున్నట్లు క్లియర్ కట్ గా ఆర్ధమవుతుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన భవిష్యత్తు రాజకీయాలపై విశ్లేషణలు చేసిన కానీ కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదు.. బీజేపీకి ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతమున్న కూటమి ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటదో కూడా తెల్వదు. అందుకే జమీలీ ఎన్నికలపై మోదీ ఆరాటపడుతున్నారు.
ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోని కేంద్రంలో చక్రం తిప్పాలన్నా. హాంగ్ ఏర్పడితే కీ రోల్ పోషించాలన్నా ముందు రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి.. ఇప్పటివరకూ ఆ పార్టీకి విభాగాలు లేవు.. పదేండ్లు ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ నడిచింది.. వాళ్లలో ప్రస్తుతం కొంతమంది పార్టీ కార్యాకలపాలకు దూరంగా ఉన్నారు.. మరికొంతమంది పార్టీ మారారు.. ఇంకొంతమంది పార్టీ మారుదామని చూస్తున్నారు. అందుకే పార్టీని బలోపేతం చేసుకోవాలి. మరోవైపు బీఆర్ఎస్ పై పదేండ్ల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వస్తే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఐదు ఏండ్లలో రావాల్సిన వ్యతిరేకత కేవలం పది నెలలకే వచ్చింది..అందుకే ఒకపక్క పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేసుకోవాలి.. మరోవైపు ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకోవాలి.. అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావాలి.. అలా కాకుండా ముందుకు పోతే గత అసెంబ్లీ లోక్ సభ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే రావడంలో ఆశ్చర్యం ఏముండదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోనైన.. కేంద్రంలోనైన పార్టీ అధికారంలోకి రావాలంటే ముందు పార్టీ నిర్మాణం బలంగా ఉండాలి కదా..?
