రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గురించి మాట్లాడుతూ ” అక్భరుద్ధీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ తరపున కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మా పార్టీ భీఫాంపై పోటి చేయాలి.. అలా బరిలోకి దిగితే నేను తిరిగి ప్రచారం చేసి గెలిపిస్తాను.. అంతేకాకుండా డిప్యూటీ సీఎం చేస్తానని ” ప్రకటించాడు.
ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ” ఎంఐఎం నేతలు గోడ మీద పిల్లిలాంటి వాళ్ళు.. వారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పాట పాడతారు.. వాళ్ల పక్కన చేరతారు.. దమ్ముంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మిగతా ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలి..
అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్న కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు .. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి.. ఈ సారి ప్రజలు రేవంత్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావు.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్భరుద్ధీన్ ఒవైసీకి కూడా కొడంగల్ లో డిపాజిట్లు దక్కవు అని కౌంటర్ ఇచ్చారు.