త్వరలోనే చంద్రబాబు పోలవరం పర్యటన..!

 త్వరలోనే చంద్రబాబు పోలవరం పర్యటన..!

ఏపీలోని  ఈఎన్సీ, ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వారం రోజుల్లో పోలవరం ప్రాజెక్టును సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తారని తెలిపారు..

పోలవరం పర్యటన తర్వాత వర్క్ షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రిలీజ్ చేస్తారు.. వచ్చేడాది జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలుపెట్టేలా సన్నాహాలు చేయాలని ఆదేశించారు..

డయాఫ్రం వాల్‌ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టాలి.. త్వరలోనే ఆర్‌ అండ్ ఆర్, భూసేకరణ పనులు కూడా పునః ప్రారంభించాలి . ఏపీ జీవనాడి అయిన పోలవరాన్ని త్వరగా పూర్త య్యేలా   అహర్నిశలు పని చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *