జగన్ పై కోపం లడ్డూపై చూపిన బాబు

YS Jagan Mohan Reddy Former CM Of Ap
మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఉన్న కోపాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి సర్కారు హిందువులంతా ఎంతో పవిత్రంగా చూసుకునే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూపై చూపారని సీపీఐ నేత నారాయణ అన్నారు.
ఈ అంశం బీజేపీ కు చెందిన ఆర్ఎస్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడిందని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యంలో హోల్ సేల్ గా దోచుకుంది. ప్రస్తుతం టీడీపీ వైసీపీ కలిసి ప్రజల సొమ్మును పేదవాళ్లకు మద్యంను అలవాటు చేసి దోచుకోవడానికి సిద్ధమయ్యాయని విమర్శించారు.
ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుక ఎక్కడ దొరకడం లేదని విమర్శించారు.
