చంద్రబాబు మనసును హత్తుకున్న ఓ హీరో లేఖ
ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. దీంతో సీఎం చంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో హీరో రోహిత్ నారా తన పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తూ ఓ లేఖను ట్విట్టర్లో పోస్టు చేశాడు..
ఆ లేఖ గురించి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ “‘ప్రియమైన నారా రోహిత్, నీ లేఖ నా మనసును హత్తుకుంది. మన కుటుంబ సభ్యుల అండ, ఆశీస్సులు సదా నా వెంట ఉన్నాయి కాబట్టే ఎన్ని ఒడిదుడుకులలో అయినా నిలబడగలిగాను.
నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు వెన్నంటి ఉంటాయి. ప్రేమతో నీ పెదనాన్న'” అని జవాబిచ్చారు.