రేవంత్ రెడ్డి తో భేటీ పై బాబు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న శనివారం ప్రజాభవన్ లో దాదాపు రెండు గంటలు భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
అయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనే లేఖ రాసాను. తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
తెలుగు వారు ఐకమత్యంగా ఉండాలి.. రెండు రాష్ట్రాలు వేరైనా, ఎవరి పాలన వారిదైనా, ఎవరైనా మన తెలుగు వారి జోలికి వస్తే మాత్రం, మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి.రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొంత మంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలి అని అయన సూచించారు.