“అతి” ఎప్పుడు అనర్ధమే బాబు…!
నారా చంద్రబాబు నాయుడు .. తన వయసు లో సగం కంటే ఎక్కువగానే రాజకీయాల్లో ఉన్న చరిత్ర.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు.. ఏ పరిస్థితినైన తనకు అనుకూలంగా మార్చుకోగల సిద్ధహస్తుడు.. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగే రాజకీయ నాయకుడు.. అన్నింటికి మించి విజనరీ.. అంతటి చరిత్ర ఉన్న చంద్రబాబు తాజాగా తిరుపతి లడ్డూ విషయంలో అతి చేస్తున్నారన్పిస్తుంది అని విశ్లేషకుల భావన..
తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలవడాన్ని ఎవరూ హార్శించరు.. నిజమైన హిందువులు సైతం దాన్ని అంగీకరించరు. అలాంటి సెన్సిటీవ్ ఇష్యూలో ముఖ్యమంత్రిగా.. బాధ్యయుతమైన పదవిలో ఉన్న నాయకుడు ఎలా ఉండాలి.. ఆ ఇష్యూని అత్యంత సామారస్యంగా పరిష్కరించి నిజనిర్ధారణ చేసి అప్పుడు దాని గురించి మాట్లాడాలి.. మరి ముఖ్యంగా కులానికి మతానికి సంబంధించిన ఇలాంటి విషయాల్లో…
అయితే ఏకంగా ఉండవల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ తిరుమల తిరుపతి వెంకన్నస్వామినే నాతో మాట్లాడి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పమని చెప్పాడని అన్నారు. అంటే ఏకంగా ఇన్నాళ్లు లేనిది అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటాక ఆ వెంకన్న స్వామి వచ్చి చెప్పాడా అంటే అది బాబుకు ఆ వెంకన్నస్వామికి తెలియాలి.. ఈ విషయాన్ని కాసేపు పక్కనెడదాము.. బాబుకు ప్రత్యర్థి అయిన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ & ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీటీడీ చైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డితో సహా క్రైస్తవ మతానికి చెందినవారని టీడీపీ & బ్యాచ్ ఆరోపణ..
ఆ ఆరోపణలకు బలం చేకూర్చుస్తూ వీరంతా బైబిల్ పట్టుకునే తిరుగుతారు.. ఎవరి మతాలు వారిష్టం. ఎవరి కులం వారిష్టం. అయితే తిరుపతి లడ్డూ విషయానికి వస్తే ఇది ఏ ఒక్కరి ఇద్దరి మనోభావాలకు సంబంధించిన విషయం కాదు.. కోట్లాది మంది హిందువుల నమ్మకం.. అలాంటిది ఈ విషయంలో బాబు చాలా ఆలోచించి మాట్లాడితే బాగుంటదని విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయంలో బాబు తప్పు చేసిన జగన్ తప్పు చేసిన ఎవరూ తప్పు చేసిన తప్పే. తప్పు చేసినవాళ్లను అసలు వదిలిపెట్టకుండా శిక్ష పడేపించాలి..
కానీ అన్ని తానై. అధికారం తన చేతిలో ఉంది కదా అని అన్ని మనం చెప్పేయకూడదు.. దానికో పద్ధతి ఉంటది.. ఆ పద్ధతి ప్రకారం ముందుకెళ్తేనే అందరికీ హర్శించదగ్గ విషయం .లేకపోతే అతిగా స్పందిస్తే అది చివరికి మన మెడకే చుట్టుకున్నట్లు బాబు వ్యవహరించే తీరులో ఏ మాత్రం లయ తప్పిన కానీ అంతిమంగా నష్టం టీడీపీ & బ్యాచ్ కు జరుగుతుంది అని రాజకీయ విశ్లేషకుల వాదన.. ఎవరి వాదన ఎలా ఉన్న కానీ అతి ఎప్పుడు అనర్ధమే కదా బాబు..!