ఓ మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ విచారణను జస్టీస్ బీఆర్ గోవాయ్,జస్టీస్ విశ్వానాథ్ ధర్మాసనం విచారిస్తుంది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ,ఈడీ తరపున అదనపు సొలిసిటర్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తున్నారు.
ఈ విచారణలో న్యాయవాది ముకుల్ రోహిత్గీ ‘ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు.రూ.100కోట్ల ముడుపుల విషయంలో ఎలాంటి నిజం లేదు.సిసోడియాకు వర్తించిన నియమాలే కవితకు వర్తిస్తాయి.ఈ కేసులో ఐదు నెలలుగా జైల్లో ఉన్నారు కవిత.ఇప్పటివరకు 493మంది సాక్షులను విచారించారు.కవిత మాజీ ఎంపీ.. ప్రస్తుత ఎమ్మెల్సీ.. ఎక్కడకి పారిపోరు.
సామాన్యులెక్కనే కవిత కూడా ఫోన్లు మార్చారు.ఈ డీ నోటీసు రాగానే కవిత తన అన్ని ఫోన్లను హ్యాండోవర్ చేశారు.సాక్ష్యాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో కవిత లేరు.ఇది తప్పుడు కేసు.. నిజముంటే ఇన్ని నెలలా..?.కవితకు బెయిల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నియమనిబంధనలను బట్టి.సాక్షులను బెదిరిస్తే ఒక్కరూ కూడా ఎందుకు ఈడీ,సీబీఐకు పిర్యాదు చేయలేదు.కవిత ఎవర్ని బెదిరించలేదు.. అన్ని ఆరోపణలే అని ఎమ్మెల్సీ కవిత తరపున వాదనలు విన్పించారు.