ఉలికిపాటుతో నిద్ర లేస్తున్నారా..?
చాలా మంది నిద్రించే సమయంలో ఏదో శబ్ధం రావడం… ఏదైన పీడ కల రావడం వలన ఉలికిపాటుతో నిద్ర లేస్తారు.. మనం కూడా అప్పుడప్పుడు ఉలికిపాటుతో నిద్రలేవడం చాలా సార్లు గమనిస్తూనే ఉంటాము.. అయితే చాలా ఎక్కువమంది తీవ్రమైన ఒత్తిడి కారణంగా రోజూ ఉదయం ఆందోళన,భయంతో మేల్కోనడాన్ని మార్నింగ్ యాంగ్జెటీ అంటారు.
దీని వల్ల అనేక సమస్యలున్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను కూడా మనం ఎదుర్కుంటామని నిపుణులు చెబుతున్నారు.. దీని నుండి బయటపడేందుకు మినిమమ్ ఏడు గంటలు నిద్రపోవాలి అంట.. ఆల్కహాల్ తాగడం మానేయాలి..
కెఫిన్ ,చక్కెర తీసుకోవడాన్ని సైతం తగ్గించాలి.. వ్యాయమం ,ధ్యానం చేయాలి.. రేపటి గురించి ఆలోచించకుండా వేళకు తింటూ హాయిగా నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..