ఎమ్మెల్యే దానం నాగేందర్ క్షమాపణ

Apology of MLA Danam Nagender
అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైన బాధపడితే.. వాళ్ల మనోభావాలను కించపరిస్తే క్షమాపణ చెప్తాను.. నేను మాట్లాడుతుంటే పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతున్నారు. అందుకే గమ్మున ఉండమని చెప్పాను.
ఆ చెప్పే క్రమంలోనే నోరు జారాను తప్పా కావాలని కాదు. నా వ్యాఖ్యల వల్ల ఎవరికైన బాధకలిగితే క్షమాపణ చెప్తున్నాను అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు..
హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.
