2019ఏపీ ఎన్నికల ఫలితాలు V/S ఎగ్జిట్ పోల్ ఫలితాలు
మరికొద్ది గంటల్లో ఏపీ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు..ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపై ఓ కన్ను వేద్దామా..?
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ VS ఫైనల్ ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ఈ విధంగా ప్రకటించాయి.
ఇండియా టుడే: వైసీపీకి 130-135 సీట్లు ఇస్తే టీడీపీకి 37-40కి స్థానాల్లో గెలుపు ఖాయమని తేల్చి చెప్పింది.సీపీఎస్: వైసీపీకి 130-133 సీట్లు, టీడీపీకి 43-44 సీట్లు ఇచ్చింది.
వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ వైసీపీకి 111-121, టీడీపీకి 54-60 స్థానాలు ఇవ్వగా ఆరా అనే మరో సంస్థ వైసీపీకి 119-126, టీడీపీకి 47-56 స్థానాలు ఇచ్చింది.
అయితే వాస్తవ ఫలితాల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లను సాధించింది. టీడీపీ 23 స్థానాలతో సరిపెట్టుకుంది. మరి ఈసారి ప్రజలు ఏ తీర్పునిస్తారో చూడాలి.