జగన్ పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!
ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల జరిగిన కార్యకర్తల.. నేతల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి జగనన్న 2.0 చూస్తారు. కార్యకర్తలను .. నేతలను ఇబ్బందులకు గురి చేసే అధికార పార్టీ నేతలను ఎవర్ని వదిలిపెట్టను.. కార్యకర్తలను కాపాడుకుంటాను. వారందరికీ అండగా ఉంటాను. ఎవరూ ఎవరికి భయపడాల్సినవసరం లేదు. నేను చూస్కుంటాను. మళ్లీ మనమే అధికారంలోకి వస్తాము అని వ్యాఖ్యానించారు.
జగన్ చేసిన వ్యాఖ్యలపై అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులు.. మాజీ మంత్రులు.. ముఖ్య నేతల వరకూ వరసపెట్టి మరి కౌంటరిస్తూ తమ పతాపాన్ని చూపిస్తున్నారు. తాజాగా ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యరాణీ ఓ అడుగు ముందుకేసి జగన్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ పిచ్చి జగన్ సైకో జగన్ గా అవతారమెత్తారు. వైఎస్ షర్మిల. విజయమ్మ గట్టివాళ్ళు కాబట్టి జగన్ కు దూరంగా ఉంటూ నిలబడుతున్నారు. శవం లేస్తే తప్పా బయటకు రానీ జగన్ ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే ఏదో మర్మం దాగి ఉందని విమర్శించారు.
ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి ఏంటో మనందరికీ తెల్సిందే. లండన్ నుండి తెచ్చుకున్న మందులు జగన్ కు పని చేయడం లేదేమో చూపించుకోవాలి.జగన్ ఏంటో ఏపీ ప్రజలందరికీ తెల్సు అని వ్యక్తిగత విమర్శలు చేశారు. అయితే బాబు ప్రకటించిన ర్యాంకులల్లో తన శాఖకు పంతోమ్మిదో ర్యాంకు ఇవ్వడంతో బాబు దగ్గర మార్కులు కొట్టేయడానికే ఇలా ఎప్పుడు మాట్లాడని సంధ్యరాణి జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.