రేవంత్ రెడ్డి యూటర్న్ ..?
తెలంగాణ ముఖ్యమంత్రి వేసిన ఎత్తులు పారట్లేదా..? అతని వ్యూహాలు బెడిసికొట్టాయా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాదానం వినిపిస్తుంది.ఓటుకు నోటు కేసులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ని జైల్లో పెట్టింది.కొన్ని రోజులు జైల్లో ఉండి భయటకు వచ్చిన రేవంత్ రెడ్డి పగతో రగిలిపోయారు.బీఆర్ఎస్ కే.సీ.ఆర్ మరీ ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ గా పనిచేస్తు వస్తున్నాడు.కసిగా పనిచేసి పార్టీని అదికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు..
అయితే ఇటీవల పార్ములా – ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే..ఏసీబీ విచారణకు సైతం కేటీఆర్ హజరయ్యారు.కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు,వార్తలు తెరపైకి వచ్చాయి.కానీ కేసులో పసలేకపోవటం,కేటీఆర్ ఏసీబీ ముందు ఉన్నవి ఉన్నట్టు చెప్పడంతో రేవంత్ రెడ్డి డిపెన్స్ లో పడినట్టు తెలుస్తుంది.ఏసీబీ అదికారులు సైతం ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయడం కుదరదంటూ రహస్య నివేదిక అందించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి..
కేటీఆర్ అందులో చేసిన నేరం ఏమీ లేదని ఆ నివేదికలో ఏసీబీ స్పష్టం చేసినట్టు సమాచారం.దీంతో చేసేదేంలేక కేటీఆర్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది.అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి పుణరాలోచనలో పడినట్టు తెలుస్తుంది.తామొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు రేవంత్ వ్యూహం బెడిసికొట్టి కేటీఆర్ కే అది ప్లస్ గా మారటం ఈ ఇష్యూలో కొసమెరుపుగా చెప్పవచ్చు..