రేవంత్ అల్లుడికి మరో చిక్కు

 రేవంత్ అల్లుడికి మరో చిక్కు

Revanth Reddy Telangana CM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ Maxbien ఫార్మా కంపెనీ పై న్యూఢిల్లీ ED కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు.కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కార్యక్రమం రేవంత్ ప్రభుత్వం చేపట్టిన తరుణంలో స్థానిక రైతులు ముఖ్యమంత్రి అల్లుడి కంపెనీకి భూములు ఇచ్చేది లేదని మొదలైన వివాదంతో Maxbien ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్ గా 16 లక్షల షేర్లు ఉండడం అదే సంస్థలో మరో డైరెక్టర్ గా ఉన్న అన్నం శరత్ మరియు తను డైరెక్టర్గా ఉన్న మరొక సంస్థకు కు 21 లక్షల షేర్లు ఉండడం, వీరు ఆరంభించిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి వరంగల్లో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ వెళ్లడం ఆసక్తి రేపుతోంది.

కీలకంగా రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే EDలో కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా ED గొలుగూరి రామకృష్ణ ను ముద్దయిగా చేర్చి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని, ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు మరియు ఇతర వ్యాపారాలకు తరలించారని ఈడి ఒక ప్రకటనలో పేర్కొన్నది.గోలుగూరి రామకృష్ణ మరియు గొలుగూరి వెంకట్ రెడ్డి, ఇద్దరూ సోదరులే కాకుండా చాలా కంపెనీల్లో డైరెక్టర్ గా వ్యాపారాలు చేస్తున్నారు.

వీరి అబ్బాయి గొలుగూరి వెంకట్ రెడ్డి, Maxbien ఫార్మా యొక్క డైరెక్టర్. ఈడీ పేర్కొన్నట్టు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఈ కంపెనీలోకి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నది. గొలుగూరి కుటుంబ సభ్యులపై ఇప్పటికే ఎన్నో బ్యాంక్ ఎగవేత కేసులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈడీ రేవంత్ అల్లుడు Maxbien ఫార్మ ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలని , పూర్తి ఆధారాలతో సహా గొలుగూరి కుటుంబం కేసులు Maxbien ఫార్మాలో సీఎం రేవంత్ అల్లుడు గొలుగూరి సత్యనారాయణ వాటా యొక్క అన్ని ఆధారాలను జతకట్టి ఫిర్యాదు చేయడం జరిగింది. క్రిశాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *