ఏపీలో మరో కొత్త పథకం

Another new scheme in AP
ఏపీలో మరో కొత్త పథకానికి నాంది పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు రూ పదివేలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన మరోహామీని నెరవేర్చినట్లు టీడీపీ పేర్కొన్నది. నిధులు లేక ఆరువేలకుపైగా దేవాలయాలు కనీసం ధూప దీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో రూ ఐదు వేలు ఇచ్చేవారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. మాటిచ్చిన ప్రకారం దాన్ని ఐదు వేల నుండి పదివేలకు పెంచారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన యాబై రోజుల్లోనే హామీ నెరవేర్చారు అని టీడీపీ తన అధికారక ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.