HCU యూనివర్సిటీపై రేవంత్ సర్కారు మరో కుట్ర..!

యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఆ భూముల్లో ఎలాంటీ పనులు చేయవద్దు. తదుపరి విచారణ జరిగేవరకూ చిన్న గడ్డిపూసను కూడా కోయకండి .. అవసరమైతే సీఎస్ ను జైలుకు పంపే హక్కు తమకుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన సంగతి తెల్సిందే.
దీంతో కక్ష్య కట్టిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ సీయూ పై కక్ష్య కట్టిందా..?. ఎవరి వలన అయితే దేశ వ్యాప్తంగా ఇటు ప్రభుత్వం. అటు పార్టీ పరువు పోవడానికి కారణమైన విద్యార్థులపై సరికొత్త కుట్రకు తెరతీసిందా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మూడేండ్లలో మేము తిరిగి అధికారంలోకి వస్తాము. ఆ నాలుగోందల ఎకరాలను వెనక్కి తీసుకుని ఏకో పార్కుగా అభివృద్ధి చేస్తాము అని ప్రకటించారు. ఇలా ప్రకటన చేశారో లేదో తెల్లారే రెండు వేల ఎకరాల్లో ఏకో పార్కును అభివృద్ధి చేస్తామని తమ అనుకూల మీడియాలో బ్యానర్ ఐటెం గా రాయించింది సర్కారు. అయితే దీని వెనక పెద్ద కుట్రనే దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏమా కుట్ర అంటే తమకు దక్కాల్సిన నాలుగు వందల ఎకరాల భూమి దక్కకుండా చేశారు. అప్పటికే టీఎస్ఐఐసీ కు బదలాయించి మరి పదివేల కోట్ల అప్పు తెచ్చాము. ఈ భూమిని అమ్మడం ద్వారా ఓ నలబై వేల కోట్లు వెనకేసుకోవచ్చు అని భావించిన రేవంత్ సర్కారు సుప్రీం కోర్టు బ్రేకులేసింది. దీంతో ఆ 400 ఎకరాలు దక్కకుండా చేస్తారా.. మీ యూనివర్సిటీనే ఇక్కడ లేకుండా చేస్తామంటూ యూనివర్సిటీ విద్యార్థుల మీద రేవంత్ “రాజీవ్ పార్క్” పేరిట రివెంజ్ అస్త్రం సంధించబోతుందని అనుకూల మీడియాలో వచ్చిన వార్తలపై విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
అందులో భాగంగా ఆ యూనివర్సిటీని అక్కడ నుండి మరోకచోటికి తరలించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇది ఎవరికీ అనుమానం రాకుండా యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో నాలుగోందల ఎకరాలతో పాటు మరో 1600 ఎకరాల్లో ఏకో పార్క్ ఏర్పాటు చేసి దానికి రాజీవ్ గాంధీ పార్క్‌గా నామకరణం చేస్తే బావుంటుందని తెలంగాణ మంత్రులు సీఎం రేవంత్ ముందు ప్రతిపాదన ఉంచినట్లు సమాచారం. చూడాలి మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవముందో మున్ముందు తెలుస్తుంది.


